Hey Pressto! Conference 2020

A WordPress and ClassicPress conference which happens only on Twitter

తెలుగు

Hey Pressto! అన్నది Twitter లో ClassicPress మరియు WordPress ల ఒక సమావేశం.

నిముషానికి ఒక ట్వీట్ చొప్పున 15 ట్వీట్ ల సమాహారం Hey Pressto!

Hey Pressto! అందరికి ఎక్కువ అందుబాటులో ఉండే సమావేశం గా ప్రసిద్ధి పొందడం యొక్క లక్ష్యం, అభిలాష మరియు ఉద్దేశ్యం. మేము ఎల్లప్పుడూ అభివృద్ధి చేయడానికి చూస్తున్నాము మరియు మీరు మా అనుభవాన్ని మాతో పంచుకోగలిగితే కృతజ్ఞతతో ఉంటారు.

మీరు మీ సైట్ గురించి గాని మీ అనుభవాల గురించి గాని చెప్తే వినాలని Hey Pressto! కోరుకుంటోంది. లక్షల్లో పోస్ట్ లు వున్న సైట్ వుందా. అద్భుతం, మాకు ఇంకా చెప్పండి. ఒక అద్భుతమైన పోస్ట్‌తో ఒక సైట్ ఉందా, అద్భుతం, మాకు ఇంకా చెప్పండి. మీ మొదటి పోస్ట్ పూర్తి చేసేరా. అద్భుతం, మాకు ఇంకా చెప్పండి. ఇంకేదైనా చేసేరా. అద్భుతం, మాకు ఇంకా చెప్పండి.

WordPress లేదా ClassicPress విరివిగా వాడే వాళ్ళ కోసం, అద్భుతాన్ని సాధ్యం చేసే డెవలపర్స్ కోసం, సమావేశాలను కార్యక్రమాలను నిర్వహించే వారి కోసం, పాలనాపరమైన విషయాలు గురించి ఆందోళన చెందుతున్నచూసేవారి కోసం, మరియు ఆశాజనక, మరియు ముఖ్యంగా మీ కోసం హే ప్రెస్టొ!

 

మనం అనేక నిర్మాణ అసమానతలు ఉన్న సమాజంలో వున్నాం, మనంత మనమే వాటిని సరిచేయలేము అన్న విషయం Hey Pressto! కు తెలుసు. అణగదొక్కబడిన, పట్టించుకొనకబడిన అభిప్రాయాలను బహిర్గత పరిచే వేదికగా హే ప్రెస్టొ! వుంటుంది.

Hey Pressto! రోజుకు 12 గంటలు పనిచేస్తుంది కనుక మీరు ప్రపంచంలో ఏ ప్రదేశం లో వున్నా, దీనిలో చేరడానికి, ప్రదర్శించడానికి తగిన సమయం దొరుకుతుంది.

మీరు ఏ భాషలోనైనా మీ విషయాలను సమర్పించడాన్ని, ప్రదర్శించడాన్ని Hey Pressto! ఆహ్వానిస్తుంది.

Twitter అందరికి అనుకూలం కాదన్న విషయం Hey Pressto! కు తెలుసు, మరియు మా వద్ద అజ్ఞాత ఖాతాలు తెరిచే అవకాశం కూడా వుంది, దీనిని మీరు కావాలంటే వాడుకొనవచ్చు.

అజ్ఞాత మార్గదర్శకత్వంను Hey Pressto! ఉచితంగా ఇస్తుంది. కావాల్సిన వారు ఈ సదుపాయాన్ని ఉపయోంచుకొనవచ్చు.

ట్వీట్ లాగా ఉన్నట్టే Hey Pressto! సమర్పణలు 280 క్యారక్టర్ పొడుగు కలిగి వుంటాయి.

మా సమర్పణ పేజీ ని (https://2020.heypresstoconf.org/submit/ ) మీరు చూడాలని, మీ అనుభవాలని, జ్ఞానాన్ని, కథలని పంచుకోవడం లో Hey Pressto! సహాయ పడగలదని ఆశిస్తోంది.

 

మాతో చేరుతారని Hey Pressto! ఆశిస్తోంది.

Hey Pressto! గురించి మీరు మీ మిత్రులతో పంచుకుంటారని Hey Pressto! ఆశిస్తోంది

దీనిని చదివినందుకు Hey Pressto! మీకు కృతజ్ఞతలు తెలుపుతూ, మీరు జాగ్రత్తగా వుండాలని, మీకు శుభం కలగాలని హే ప్రెస్టొ! కోరుకుంటోంది.

Do NOT follow this link or you will be banned from the site!